జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేసారు. పల్లెల్లో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జేజేఎం 2.0 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా సీఎం చంద్రబాబు, వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

