మంత్రి నారా లోకేష్‌తో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు ఈ విద్యాసంవత్సరంలో మరే ఇతర విద్యేతర పనులు ఉపాధ్యాయులకు ఉండవని స్పష్టం చేశారు. డీఈఓ, ఎంఈఓలు కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్పైనే దృష్టిపెట్టాలని, వారికి సర్వీసు రూల్స్ బాధ్యతలు అప్పగించబోమని స్పష్టంచేశారు. కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏపీవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు మంత్రి నారా లోకేష్.

