
ఇండియా-పాకిస్తాన్ గొడవ ప్రాథమికంగా ‘అమెరికా వ్యవహారం కాదు’ అని, పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలను అమెరికా కోరగలదని, కానీ ఈ గొడవలో జోక్యం చేసుకోలేమని వాన్స్ అన్నారు.” అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం గురించి అమెరికా ఆందోళన చెందుతోందని, అలా జరగకుండా నిరోధించడానికి కృషి చేస్తోందని వాన్స్ అంగీకరించారు.