ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులపై అదనపు ‘ఫ్యూయల్ సర్చార్జ్’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 14 (శనివారం) అర్థరాత్రి 12:01 గంటల నుండి అమలులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి.

