
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ACIO (II) ఎగ్జిక్యూటివ్ నియామకానికి నోటిఫికేషన్ను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 3,717 పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 19జులై 2025న ప్రారంభమవుతుంది. 10ఆగస్టు 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ mha.gov.inద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు లింక్ 19 జులై 2025 నుంచి యాక్టివ్ అవుతుంది.