రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం కాలేజీ లాగిన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల నుంచి హాల్ టికెట్లు తీసుకుని
అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే తెలియజేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

