
2024-25 విద్యా సంత్సరానికి మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ , మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 26 జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి అమరావతిలోని చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్లో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశారు.