ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అందించే కాలేజీల్లో అక్రమాలు జరిగినట్టు వచ్చిన నివేదికలపై ప్రభుత్వం దృష్టిసారించింది. పోలీస్ శాఖ, విద్యాశాఖ కలిసి ఈ తనిఖీలను సమగ్రంగా నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది

