కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.వీరన్నది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయక బతుకులు భారమైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని బాండ్లు రాసిచ్చారని, అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేయడం దుర్మార్గమని ఎక్స్ వేదికగా మండిపడ్డారు

