శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రవేశానికి అనుమతి కోరిన ట్రాన్స్జెండర్ పిటిషన్ను కేరళం ప్రభుత్వం వ్యతిరేకించింది. పిటిషనర్ లింగాన్ని స్పష్టంగా నిర్ధరించే వైద్య లేదా అధికారిక ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే ఆలయ ప్రవేశానికి అనుమతించలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తీసుకున్న వైఖరికి మద్దతు తెలిపింది. తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిళ నిర్ణీత ఆచారాలు, క్రతువులు పూర్తిచేసిన ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వ్యక్తులకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

