
లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
ఈ కుంభకోణంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిష్టర్ అయ్యాయని ఆయన ప్రశ్నించారు.