
గచ్చిబౌలిలో భూములు ఎవరూ కొనొద్దని, ఒకవేళ ఎవరైనా కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో అద్భుతమైన ఏకో పార్క్‌ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో తమ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.