దేవుడి భూములు రక్షించే దేవాదాయ శాఖ అధికారులపై దాడులు చేస్తే ఊరుకోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తే పిడి యాక్టు పెడతామని మంత్రి కొండా హెచ్చరించారు. రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఎపి)లో కబ్జాకు గురవుతుండడాన్ని
అడ్డుకున్న ఈ రమాదేవిపై దాడి చేయడం సహేతుకం కాదని మంత్రి సురేఖ హితవు పలికారు.

