
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (NFDB) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. దేశ ఆక్వారంగానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తోందని.. ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలోని 16.50 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో ఏపీ వాటా 32 శాతంగా ఉందని…దీని విలువ రూ.19,420 కోట్లుగా వివరించారు.