టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కో ఆర్డినేటర్లతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

