మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నది. అయితే ఆమె తన అరచేతిలో సూసైడ్ నోట్ రాసుకున్నది. గడిచిన అయిదు నెలల్లో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నాలుగు సార్లు అత్యాచారం చేసినట్లు ఆ నోట్‌లో రాసిందామె. ఫల్టన్ సబ్ జిల్లా ఆస్పత్రిలో ఆమె మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా ఆమె డీఎస్పీకి లేఖ రాసింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల ప్రకారం ఆఫీసర్ బద్నేను సస్పెండ్ చేశారు.

