అసెంబ్లీ ఎన్నికల వేళ.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని పరిగణిస్తున్నారు.

