హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉండటమే కాకుండా వన్యప్రాణులు కూడా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

