
తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో నాంపల్లిలోని బీజేపీ ర్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ విజయమని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.