ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును.. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమస్యలపై తుమ్మల చర్చించారు. 5 గ్రామపంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. జగ్గయ్యపేట నేషనల్ హైవే పనుల వేగవంతంపై చొరవ చూపాలని మంత్రి తుమ్మల చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు టీటీడీలో తెలంగాణకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు.

