ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలన్నారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్టసవరణ ముగింపు పలుకుతుందన్నారు.

