ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల చేశారు. అయితే, ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారు పొందే రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం పన్ను బిల్లులో సర్దుబాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

