
ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా భావించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ‘ఎరిస్’ రాకెట్ తన మొదటి పరీక్షా ప్రయోగంలో కేవలం 14 సెకన్లలోనే విఫలమవడం దేశానికి పెద్ద షాక్‌గా మారింది. ఈ ఘటన క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ ఆర్బిటల్ స్పేస్‌పోర్ట్‌లో చోటుచేసుకోగా, రాకెట్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఆకాశాన్నంటాయి.