సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న 2026 ఆస్కార్ నామినేషన్లను అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2025లో విడుదలైన అత్యుత్తమ చిత్రాల మధ్య ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది నామినేషన్లలో రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని, గతంలో ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉన్న 14 నామినేషన్ల రికార్డును బ్రేక్ చేసింది. ‘సిన్నర్స్’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం అత్యధిక నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది.

