
థియేటర్లు మూసివేత వివాదంపై దిల్ రాజు వివరణ ఇచ్చిన వెంటనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ల నటన చూడలేకపోతున్నాం” అంటూ చేసిన ట్వీట్ దిల్ రాజునే ఉద్దేశించి చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. నీకు దమ్ముంటే ఎవరిని ఉధ్దేశించి అంటున్నావో చెప్పన్నా అని కొందరు బండ్ల గణేష్‌ని నిలదీస్తున్నారు. మరికొందరేమో ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వచ్చి స్పీచ్ ఇవ్వన్నా అని కోరుతున్నారు.