
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక WPC ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మనోజ్ కుమార్ అసాధారణమైన ప్రతిభను, సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ గెలుపు దేశానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనోజ్ అద్భుతమైన విజయం భారతదేశానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణం.