బిహార్లో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని శీతల మాతా ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. 12 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతిచెందినవారంతా మహిళలేనని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.