రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే మూలస్తంభాలు. వ్యవసాయం నుంచి అంతరిక్ష వరకు, స్వయం ఉపాధి నుంచి రక్షణ రంగం వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె నివాళులర్పించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు.

