
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం అవుతూ రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం
అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు.