తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సంవత్సరం (2026) నుండి 2.1% DA పెంపు పైన ప్రభుత్వం ప్రకటన చేసింది 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలు కానుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని అధికారులు వెల్లడించారు.

