కర్ణాటక మంత్రివర్గం గురువారం రోడ్లపై కవాతులు చేయడం, బహిరంగ ప్రదేశాలు,ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమనిబంధనలు తీసుకురావలని నిర్ణయించింది. ‘మేము ఏ సంస్థను నియంత్రించలేము. కానీ ఇకపై బహిరంగ ప్రదేశాలలో లేదా రోడ్లపై మీకిష్టమున్నట్లు చేయలేరు. మీరు ఏది చేయాలన్నా అది ప్రభుత్వం అనుమతితోనే చేయాల్సి ఉంటుంది’ అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విలేకరులతో అన్నారు.

