రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోనల్ 1లో 379 పోస్టులు, మల్టీ జోనల్ 2లో 228 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరగనుంది. జులై 10వ తేదీ నుంచి జులై 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

