
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై స్థానిక మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ అనుసరిస్తున్న వైఖరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఎప్పుడూ పోలీస్ డ్రెస్‌లో కనిపించలేదంటూ ఈ ఏఎస్పీకి చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం, తెలివి సైతం లేవన్నారు. ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతున్నారని విమర్శించారు.