స్పైసీగా వీడియో కాల్స్‌తో పరిచయం పెంచుకుని అందంతో వల వేసి లోకల్ నుంచి ఎన్ఐఆర్ల వరకు ఉచ్చులో దింపి వసూళ్లకు పాల్పడే జమీమా మళ్లీ అరెస్ట్ అయింది.వెస్ట్ బెంగాల్‌కి చెందిన వ్యక్తిని మోసగించిన కేసులో చాలామంది జమీమాకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు.ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.హనీ ట్రాప్ కోసం జమీమా ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను మెయిన్‌టెయిన్ చేస్తోంది.ఇప్పుడా ముఠా మూలాలన్నింటిని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.

