
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ వివాదంలో చిక్కుకున్నారు.. ఆమె ఆఫీస్‌బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ‘మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకొని నాపై చెబుతావా..
నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా’ కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనాభాను ఆఫీస్ బాయ్‌ని చెప్పుతో కొట్టారు. కొంతకాలంగా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని హాసీనాభాను చెబుతున్నారు.. అయితే అటెండర్ మాత్రం తనకు ఏం తెలియదు అంటున్నారు.