గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్‌కు.. లోకల్ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులకు.. కమిషనర్‌కు మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఇలా ఏ అంశంలోనూ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు వ్యాపారులకు సరైన సమాచారం ఇవ్వకుండా.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఎమ్మెల్యేల ఆరోపణ.

