
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందు.. కేంద్రం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఆపరేషన్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ బహిరంగంగా చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.