
ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు… అయితే గందరగోళం మధ్యే ఇది ఆమోదం పొందింది. అమాయక ప్రజలకు డబ్బులు ఆశచూపే ఆన్లైన్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించడమే కాదు మంచి ఆన్లైన్ గేమ్స్ ను ప్రోత్సహించేలా ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఇక అమల్లోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.