
సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. అయితే, ఈ కంటెంట్‌పై సెన్సార్షిప్ ఉండకూడదని తెలిపింది. వాక్ స్వాతంత్య్రం హక్కుకు విఘాతం కలుగకూడదని స్పష్టం చేసింది. ఈ రంగంతో సంబంధం ఉన్నవారందరి సలహాలు, అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. పాడ్‌కాస్టర్ రణ్వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది.