
ఆధార్ కార్డు భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఒక అధికారిక గుర్తింపు. ఇది అందరికీ తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రతి చిరునామాకు (అడ్రస్) ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీని (డిజిటల్ అడ్రస్) కేటాయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. ప్రధాన లక్ష్యం ఏంటంటే, తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం.. స్పష్టంగా వినియోగదారుల చేతుల్లోనే ఉండాలి.