
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్‌కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. రాజేశ్వరి పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్ లో వెలుగునింపడం కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు చిరు.