
మూడు రోజులుగా కొనసాగుతున్న ట్రెండ్ ను నాలుగో రోజు ధోనీ కొనసాగించాడు. ప్లే ఆఫ్స్ కి సెలెక్ట్ అయి టాప్ 2 ప్లేస్ కోసం ట్రై చేస్తున్న బడా టీమ్ గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ ను 83పరుగుల తేడాతో గెలుచుకుంది. బ్యాటింగ్ ఎంచు కున్న చెన్నై ఓపెనర్ల జోరుతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 231 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే ఆడింది.