
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి పెద్ద ఊరటనిచ్చే శుభవార్తను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. తెల్లమచ్చ వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశం నుంచి రొయ్యల ఎగుమతులపై విధించిన పరిమితులను తాజాగా ఎత్తివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఉత్పత్తిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ తమ స్థానం పొందే అవకాశమొచ్చింది. ఎగుమతుల పునరుద్ధరణతో లక్షలాది ఆక్వా రైతులకు ఉపశమనం లభించనుంది.