
తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ఆక్వా మెరైన్ పార్కును రూ.300 కోట్ల భారీ నిధులతో నిర్మిస్తున్నారు. అయితే సముద్రం లేకుండా ఆక్వా మెరైన్ పార్కును నిర్మించడం సాధ్యం కాదంటూ తక్షణమే దానిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని రేణూ దేశాయ్, శ్రీవిద్య కోర్టులో పిల్ దాఖలు చేశారు. సముద్రంలేని చోట అరుదైన జాతులు కృత్రిమ నీటిలో జీవించలేవని పేర్కొన్నారు ఆక్వా మెరైన్ పార్కు ఏర్పాటుకు ముందు సముద్ర జీవులు, వాటి సహజ అలవాట్లపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని కోర్టుకు వివరించారు.