
ఎంతో ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణ, యూనివర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్స్‌లర్ జీపీ రాజశేఖర్‌తో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల ప్రారంభ వేడుకను నిర్వహించనున్నట్లు వీసీ వివరించారు.