
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదం మేరకు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ డూండి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందు సమంత తాజాగా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ముగ్గురు జడ్జిలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు మేరకు బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.