
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్స్‌ను ఒకరోజు మూసివేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతున్నప్పటికీ కొందరు అధికారుల తీరు సరిగా లేదని స్కూల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖాస్త్రం సంధించారు. తమ బాధలు చెప్పుకొంటూ గురువారం స్కూల్స్ మూసి వేసి నిరసన తెలియజేస్తున్నట్టు వెల్లడించాయి.