భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఈశాన్య రాష్ట్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అసోంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. జోర్హాట్ నుంచి ఎగిరిన ఈ యుద్ధ విమానం.. కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, మారుమాల ఓ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఫైటర్ జెట్ గల్లంతైనట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

