తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసమని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రతులను చింపిపారేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ చెవుల్లో పూలు పెట్టుకుని సభ నుంచి బయటికి వచ్చారు.

