అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ డొల్ల అని, అందుకే దానికి సంబంధించిన పత్రాలను చించివేశామని హరీష్రావు చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారని, కానీ ఆ హామీలను ఈ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. కోటి మంది మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని మాటతప్పారని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

